వరంగల్–ఖమ్మం నేషనల్ హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి (NH–563) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్మాల పర్యోజనలో భాగంగా ఈ రహదారిని 4 లైన్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 2,484 కోట్లు కేటాయించినట్లు అధికారిక సమాచారం.
జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ సెక్షన్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని జంక్షన్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ తదితర పనులను చేపట్టనున్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
పనులు పూర్తయ్యాక వరంగల్–ఖమ్మం మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుందని అధికారులు వెల్లడించారు.

Post a Comment