ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ఖమ్మం జిల్లా | డిసెంబర్ 29: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంజనాపురం గ్రామ శివారులో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖపట్నం నుంచి ఖమ్మం వైపు ప్రయాణిస్తున్న కారులో మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో తల్లాడ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీతో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలకృష్ణ (30), అనిల్ (31) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment