-->

జగిత్యాల సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీ మృతి – గుండెపోటే కారణమని వైద్యుల నిర్ధారణ

జగిత్యాల సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీ మృతి – గుండెపోటే కారణమని వైద్యుల నిర్ధారణ


జగిత్యాల జిల్లా సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సైబర్ క్రైమ్ కేసులో రిమాండ్‌లో ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన కొత్వల్ కృష్ణ (43) జైల్లో ఉన్న సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సోమవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో కృష్ణకు అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి రావడంతో జైలు అధికారులు వెంటనే స్పందించి జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదని వైద్యులు వెల్లడించారు.

మృతికి హార్ట్ అటాక్ కారణమని ప్రాథమికంగా నిర్ధారణ కాగా, ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు, చట్ట ప్రక్రియల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793