-->

KTPS 7వ దశలో TRVKS యూనియన్‌లో చేరిన ఉద్యోగులు

KTPS 7వ దశలో TRVKS యూనియన్‌లో చేరిన ఉద్యోగులు


పాల్వంచ | డిసెంబర్ 16: KTPS 7వ దశలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు TRVKS యూనియన్‌లో చేరారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న TRVKS యూనియన్ విధానాలు తమను ఆకర్షించాయని నూతన సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.

TRVKS యూనియన్‌లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇలా ఉన్నాయి: B. బాలు (JPA), P. లక్ష్మినారాయణ (ఆర్టిషియన్), S. శివ, P. బాబు, K. డేవిడ్, B. భరత్ బాబు, N. నరసింహ రావు, D. శివ, T. నవీన్, G. శ్రీకాంత్.

ఈ సందర్భంగా TRVKS – KTPS 7వ దశ రీజనల్ అధ్యక్షులు దెంచనాల రాంబాబు నూతన సభ్యులకు యూనియన్ మెంబర్షిప్ కార్డులు అందజేసి, యూనియన్‌లోకి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో GENCO ఉపాధ్యక్షులు ధర్మపురి నాగేశ్వరరావు, GENCO అసిస్టెంట్ సెక్రటరీలు Md. అమీన్, K. బిక్షపతి, రీజనల్ నాయకులు ప్రదీప్ తదితరులు పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

TRVKS యూనియన్ మరింత బలోపేతం కావడంలో ఉద్యోగుల భాగస్వామ్యం కీలకమని, భవిష్యత్తులో ఉద్యోగుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాయకులు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793