-->

ABN ఛానల్‌ను బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ

వెంకటకృష్ణ అనుచిత వ్యాఖ్యలు.. ABN ఛానల్‌ను బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ


హైదరాబాద్, జనవరి 25: ABN టీవీ ఛానల్ వ్యాఖ్యాత వెంకటకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని సమావేశాలు, కార్యక్రమాలకు ABN ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది.

అలాగే ABN టీవీ ఛానల్ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ పాల్గొరాదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ఇటీవల ABN టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావును ఉద్దేశించి ఛానల్ వ్యాఖ్యాత వెంకటకృష్ణ “గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్” అంటూ అవమానకరంగా మాట్లాడిన వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, జర్నలిస్టిక్ నైతికతకు విరుద్ధమని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావుకు వెంకటకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పేవరకు తమ నిర్ణయం యథాతథంగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793