వైన్స్ షాపుల విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
.
మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ షాపుల నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్స్ షాపులు తెరవాలని, అలాగే సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూంలోకి వినియోగదారులను అనుమతించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
అయితే, ఈ ఆదేశాలను పట్టించుకోకుండా కొన్ని వైన్స్ షాపులు ముందుగానే తెరవడంతో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకుని బలవంతంగా షాపులను మూసివేయించారు. దీనిపై వైన్స్ షాపు యజమానులు తమకు నష్టం కలుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
యజమానుల ఫిర్యాదుల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం 10 గంటల సమయంలో స్వయంగా అక్కడికి చేరుకుని వైన్స్ షాపులను తెరిపించారు. ఇదే సమయంలో వైన్స్ షాపుల పరిసరాల్లో స్థానిక పోలీసులతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించించారు.
ఈ తనిఖీల్లో ఒక్కరోజులోనే పదికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడంతో పరిస్థితి మారింది. దీంతో సంస్థాన్ నారాయణపూర్ మండలంలో వైన్స్ షాపు యజమానులు స్వచ్ఛందంగా మధ్యాహ్నం 1 గంటకే షాపులు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనతో మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ షాపుల నిర్వహణపై చర్చ జోరుగా సాగుతోంది

Post a Comment