-->

పసర బ్రిడ్జీ వద్ద రెండు కార్లు ఢీ.. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి సీతక్క

పసర బ్రిడ్జీ వద్ద రెండు కార్లు ఢీ.. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి సీతక్క


ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర బ్రిడ్జీ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న రెండు కార్లు బ్రిడ్జీ వద్ద ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు గాయపడినట్లు సమాచారం.

ప్రమాద సమయంలో మేడారం వైపు ప్రయాణిస్తున్న రాష్ట్ర మంత్రి సీతక్క ఈ ఘటనను గమనించి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన భక్తులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, వారికి అవసరమైన తక్షణ సహాయం అందించాలని అక్కడున్న పోలీసులకు, అధికారులకు సూచించారు.

అలాగే గాయపడిన భక్తులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మంత్రి చూపిన మానవీయ స్పందనకు స్థానికులు, భక్తులు ప్రశంసలు వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793