-->

ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాహం సాదాసీదాగా, ఆదర్శప్రాయంగా జరిగింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా చౌటుప్పల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు. ప్రభుత్వ సేవలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ, సాధారణ ప్రజలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఈ వివాహాన్ని సాదాసీదాగా నిర్వహించడం ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ వివాహ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793