శ్రీశ్రీశ్రీ మహాంకాళి అమ్మవారి దేవాలయం శివరాత్రి మహోత్సవాలు
ఫిబ్రవరి 15న శ్రీ భాగ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
కొత్తగూడెం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ భాగ్యేశ్వర స్వామి వారి పంచాయతన క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మాఘ మాసం బహుళ త్రయోదశి అయిన ఆదివారం ఫిబ్రవరి 15, 2026 న మహాశివరాత్రి సందర్భంగా ఈ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం, గాయత్రి హోమం, రుద్ర హోమం, అన్న సమారాధన వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.
అలాగే ఈ పంచాయతన క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీశ్రీశ్రీ మహాంకాళి అమ్మవారి దేవాలయం మరియు శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవి క్షేత్రపాలిక అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు.
భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, తమ శక్తి కొలది ధన, ద్రవ్య, వస్తు రూపేణా సహకారం అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కాళీ ఉపాసకులు నరేంద్రభవానీ స్వామి విజ్ఞప్తి చేశారు.

Post a Comment