-->

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు స్పాట్ డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు స్పాట్ డెడ్


హైదరాబాద్, జనవరి 08 : హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో మరో హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ వద్ద అర్ధరాత్రి దాటిన అనంతరం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కళాశాల విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

శంకర్‌పల్లి మండలం దొంతానపల్లిలోని ICFAI (IBS) కళాశాలలో బీబీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మోకిల నుంచి హైదరాబాద్ వైపు కారులో ప్రయాణిస్తుండగా, మీర్జాగూడ గేట్ సమీపంలో కారు వేగంగా వెళ్లి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు విద్యార్థులు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులను సూర్యతేజ (20), సుమిత్ (20), శ్రీనిఖిల్ (20), రోహిత్ (18)గా పోలీసులు గుర్తించారు. మరో విద్యార్థిని నక్షత్ర (20) తీవ్రంగా గాయపడటంతో ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న మోకిల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చేతికొచ్చిన పిల్లలు అకాల మరణం పాలవడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా, ICFAI కళాశాలలో కూడా శోకసంద్రం అలుముకుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793