హాజ్రాత్ ఖాదర్ బాబా చిల్లా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు సుజాతానగర్
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం ఈగ్గా గుట్టలో గల హాజ్రాత్ ఖాదర్ బాబా చిల్లా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు.
ఈ ఉర్సు ఉత్సవాలు షేక్ ఖాదర్ ఖాసీం ఖాద్రి ఆధ్వర్యంలో జనవరి 30వ తేదీన గంధం, ఛాదర్, ఊరేగింపుతో చిల్లా షరీఫ్‌కు చేరుకుని ఫతేహ అనంతరం అన్నప్రసాదం నిర్వహిస్తారు. జనవరి 31వ తేదీన దీపారారాధన, ఫతేహ ఖానీ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగనున్నాయి.
ఈ ఉత్సవాల్లో హాజ్రాత్ ఖాదర్ బాబా ప్రియ శిష్యులు అయిన షేక్ యాఖుబ్ అలీ తాజ్ ఖాద్రి కుమారుడు షేక్ ఖాదర్ ఖాసీం ఖాద్రి, ఆయన సోదరులు మొహమ్మద్ అహ్మద్ ఖాద్రీ, సయ్యద్ ఖాజా పాషా చిస్తీ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొననున్నారు.
ఉర్సు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, దువాలు నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఖాదర్ బాబా ఆశీస్సులు పొందాలని దర్గా నిర్వహకులు తెలిపారు. ఉత్సవాలు శాంతియుతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ముగుస్తాయని పేర్కొన్నారు.

Post a Comment