ఆటో కార్మికుల సంఘం బలోపేతానికి కృషి చేయాలి: ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ
యైటింక్లయిన్ కాలనీ, ఆటో కార్మికుల సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జమాత్ ఇ ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్, జాతీయ సంఘం నేత ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పిలుపునిచ్చారు.
మంగళవారం యైటింక్లయిన్ కాలనీలోని షిర్కే ఆటో డ్రైవర్ యజమానుల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమైనప్పటి నుంచి ఆటో కార్మికులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జనగామ రవీందర్, ప్రధాన కార్యదర్శి ఆరెల్లి విజయ్ కుమార్, కోశాధికారి అంకుశావలి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment