భద్రాద్రి కొత్తగూడెంలో పెన్షనర్ల మెగా మెమోరాండం సమర్పణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. 25.03.2025న అమలులోకి వచ్చిన ఆర్థిక సవరణల వాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్, న్యూ ఢిల్లీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా మెగా మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని Narendra Modi గారికి పంపించే వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ అనంత రామకృష్ణకు ప్రతినిధులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో TSGREA భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ అధ్యక్షులు ఈజీఆర్ వెస్లీ, ప్రధాన కార్యదర్శి ఎం కోటేశ్వరరావు తదితరులతో పాటు వివిధ యూనిట్లకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చుంచుపల్లి, పాల్వంచ, కొత్తగూడెం యూనిట్ల నుంచి పలువురు సభ్యులు హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
అదేవిధంగా భద్రాచలం యూనిట్ ప్రతినిధులు భద్రాచలం RDO కార్యాలయంలో, అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ, మణుగూరు, ఇల్లందు, బూర్గంపహాడ్ ప్రాంతాల యూనిట్లు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో మెమోరాండాలను సమర్పించారు.
పెన్షన్ హక్కులను కాపాడాలని, ప్రతిపాదిత చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరారు.

Post a Comment