రంజాన్ ఈద్ సందర్భంగా సేమియాల పాయసంను పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పెద్ద బజార్‌లో జనతా ప్లాస్టిక్ కిరాణా & రైస్ మర్చంట్ యజమాని మొహమ్మద్ రియాజ్ అలీ ఆధ్వర్యంలో రంజాన్ ఈద్ సందర్భంగా శనివారం అనగా మార్చి 21వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి సేమియాల పాయసంను పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మానవులంతా ఒక్కటేననే సందేశంతో, కులమతాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రంజాన్ పండుగ ఆనందాన్ని అందరితో పంచుకునే ఉద్దేశంతో సేమియా పాయసంను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరై సేమియా పాయసంను స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.

Post a Comment