సెలూన్ ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు
విశాఖపట్నం: నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో సెలూన్ ముసుగులో నడుస్తున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. బుధవారం సాయంత్రం ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్‌పోర్ట్ సీఐ శంకరనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి మర్రిపాలెం వెళ్లే మార్గంలో ఉన్న ఓ భవనంలో “హెయిర్ పోర్ట్ సెలూన్” పేరిట దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ హెయిర్ కటింగ్ లేదా మసాజ్ సేవలు అందించకుండా గదులను వ్యభిచారం కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
బయటి వారికి అనుమానం రాకుండా సెలూన్‌కు వచ్చినట్లు నటిస్తూ ఈ దందాను కొనసాగించారు. ప్రధాన నిర్వాహకుడు ‘చంటి’ అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకొని, అమ్మాయిల ఫొటోలను ముందుగానే విటులకు మొబైల్ ఫోన్ల ద్వారా పంపించి, బేరం కుదుర్చుకుని వారిని అక్కడికి రప్పించేవాడు.
పోలీసుల దాడిలో ముగ్గురు యువతులు, ఒక విటుడు, అలాగే నిర్వాహకుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఎన్‌ఏడీ జంక్షన్ ప్రాంతం స్పా, వెల్‌నెస్ సెంటర్ల ముసుగులో వ్యభిచార కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఉన్న ఒక స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి ఇలాంటి దందాను బయటపెట్టిన విషయం తెలిసిందే.

Post a Comment