భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం – నిరుపేద కుటుంబం ఆస్తి నష్టం
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు కాసిం పల్లెలో గురువారం (19/03/2026) విషాదకర ఘటన చోటుచేసుకుంది. చల్లూరిపల్లె గ్రామానికి చెందిన చెలిమిటి లింగయ్య నివసిస్తున్న పూరి గుడిసెకు గుర్తుతెలియని ఆగంతుకులు రాత్రి సమయంలో నిప్పు పెట్టడంతో గుడిసె పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న నిత్యావసర సరుకులు, సుమారు రూ.10,000 విలువైన సామగ్రి, మంచాలు, ధాన్యం బస్తాలు (సుమారు 10), 12 కోళ్లు, అలాగే ఆవులు మంటల్లో కాలిపోయాయి. మొత్తం మీద సుమారు రూ.1.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.
రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లింగయ్య కుటుంబం ఈ ఘటనతో తీవ్రంగా దెబ్బతింది. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై సహాయం కోసం వేడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే ఆర్థిక సాయం అందించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Post a Comment