పెన్‌పహాడ్‌లో గంజాయి రవాణా భగ్నం – ముగ్గురు అరెస్ట్
పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
గురువారం ఉదయం సుమారు 10:40 గంటల సమయంలో ఎస్సై గోపి కృష్ణ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒకే స్కూటీపై వస్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటాడి వారిని పట్టుకున్నారు.
విచారణలో వారు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తేలింది. నిందితులు నాలుగు రోజుల క్రితం ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో 2 కేజీల గంజాయి కొనుగోలు చేసి, కొంత వినియోగించి, మిగిలిన 1.700 కేజీలను సూర్యాపేటలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది.
అరెస్ట్ అయిన వారు:
- బొమ్మకంటి గోపి (26), ప్లంబర్, మాచారం గ్రామం
- చింతల వెంకటేష్ (26), వెల్డింగ్ కార్మికుడు, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు (ఆంధ్రప్రదేశ్)
- వొగ్గు ఈశ్వర్ (22), పెయింటర్, పెన్‌పహాడ్
వారి వద్ద నుంచి 1.700 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, AP-39-JY-1357 నంబర్ గల స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో ఎస్సై గోపి కృష్ణతో పాటు కానిస్టేబుళ్లు జోసెఫ్ మధుకర్, లింగరాజు, ప్రవీణ్ పాల్గొన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Post a Comment