-->

కరీంనగర్ రూరల్‌లో దొంగతనం కేసు ఛేదనం – నలుగురు అరెస్ట్

కరీంనగర్ రూరల్‌లో దొంగతనం కేసు ఛేదనం – నలుగురు అరెస్ట్


కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, బుధవారం రాత్రి కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలోని సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్ స్టోర్ రూమ్‌లో సుమారు రూ.60 వేల విలువైన కరెంట్ వైర్ బెండిల్స్‌ను దొంగలు అపహరించారు.

ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం తీగలగుట్టపల్లి నుండి ఆరేపల్లికి వెళ్లే మార్గంలో ఎల్లమ్మ గుడి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టు అయిన నిందితులు:

  • బొంత కుమార్
  • అలకుంట్ల జంపయ్య అలియాస్ జంపరాజు
  • సూర శివాజీ
  • సూర నవీన్

వారిపై కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సీఐ పేర్కొన్నారు.

ఈ కేసును త్వరగా ఛేదించి నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, కానిస్టేబుల్స్ సల్మాన్, అఫ్జల్‌లను సీఐ అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793