ఉపాధి హామీ పనుల పరిశీలన – కార్మికులకు సౌకర్యాలపై గ్రామస్తుల డిమాండ్
సిద్దిపేట జిల్లాలోని యాడారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గౌరవ గ్రామ సర్పంచ్ గొబ్బూరి సుధారాణి, ఉప సర్పంచ్ సుద్దాల రాజు, వార్డు సభ్యులు గొబ్బూరి రాజిరెడ్డి, బ్యాటరీ సుజాత, కొత్తపల్లి భాస్కర్, సిద్దిపేట సులోచన తదితరులు మంగళవారం (మార్చి 17) పరిశీలించారు.
గ్రామంలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికుల కోసం సర్పంచ్ స్వయంగా డాక్టర్ మరియు వాహన సౌకర్యాన్ని ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹300 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికుల భద్రత కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో పూర్వ చంద్ర కుమార్, ఫీల్డ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్‌లను కోరారు. ప్రతి పనిస్థలంలో టెంట్లు, గడ్డపారలు, తగిన పనిముట్లు, తాగునీటి సదుపాయం, గ్లూకోస్ ప్యాకెట్లు, డాక్టర్, నర్స్‌ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
ఇంకా ప్రతి గ్రూప్‌కు సరిపడా పనిముట్లు ఇవ్వాలని, వాటర్ మెన్‌ను నియమించాలని, గతంలో ఉన్న వాటర్ మిల్ సదుపాయాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా బుష్ కటింగ్, యాడారం చెరువులో గుంతలు తవ్వడం, రోడ్డు పనులు, నల్లమట్టి తరలింపు వంటి పనులు చేపడుతున్నారు. చెరువుల్లో నీటి నిల్వ పెరిగి రైతులకు ఉపయోగపడేలా చూడాలని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
ప్రతి జాబ్ కార్డు కలిగిన కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలని, పనిలో ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ సుధారాణి పేర్కొన్నారు. తాము సొంత వాహనాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కూడా సహకరించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ మండల అధ్యక్షుడు కొరివి నరసింహులు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎవరికైనా సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని (సెల్: 9866497104) తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను సర్పంచ్‌కు వినిపించి తక్షణ పరిష్కారం కోరారు.

Post a Comment