అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని యాద్గార్‌పల్లి చౌరస్తా వద్ద గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
అతి వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. మృతులను గబ్బిలాల్‌పేట్ ప్రాంతానికి చెందిన కాకరాజు, అరుణ్‌గా పోలీసులు గుర్తించారు. వీరు జవహర్‌నగర్‌లో వాషింగ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment