-->

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో 7,437 పోలీస్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

 

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో 7,437 పోలీస్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో 7,437 పోలీస్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

శాఖల వారీగా పోస్టుల వివరాలు

సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు:

  • సివిల్ ఎస్ఐ – 148
  • రిజర్వ్ ఎస్ఐ (AR) – 14
  • రిజర్వ్ ఎస్ఐ (TGSP) – 12
  • రిజర్వ్ ఎస్ఐ (SARCPL) – 3
  • అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB) – 23

పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు:

  • సివిల్ కానిస్టేబుల్ – 3,697
  • AR – 1,052
  • SARCPL – 24
  • డ్రైవర్ (PTO) – 20
  • మెకానిక్ (PTO) – 7

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):

  • సబ్ ఇన్‌స్పెక్టర్లు – 44
  • కానిస్టేబుళ్లు – 1,380

ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ:

  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు – 39
  • ఫైర్ ఫైటర్లు – 751

జైళ్ల శాఖ:

  • డిప్యూటీ జైలర్ (పురుషులు) – 14
  • డిప్యూటీ జైలర్ (మహిళలు) – 1
  • వార్డర్ (పురుషులు) – 196
  • వార్డర్ (మహిళలు) – 12

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న శారీరక, వైద్య అర్హతలు తమకు ఉన్నాయో లేదో సివిల్ సర్జన్ ద్వారా పరీక్షించుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది.

అవసరమైన ధ్రువపత్రాలు

దరఖాస్తు సమయంలో తెలంగాణ స్థానికతను నిర్ధారించే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే 2026 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన నాన్-క్రీమీలేయర్ (BC), EWS సర్టిఫికేట్, ఎస్సీ అభ్యర్థులు ఉపకుల వర్గీకరణ స్పష్టంగా ఉన్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు.

ఈ భారీ నోటిఫికేషన్‌తో రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలు లభించనున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793