తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం హామీలను త్వరగా అమలు చేయాలి: కేజీఎస్ మాథ్యూస్
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం హామీలను త్వరగా అమలు చేయాలి: కేజీఎస్ మాథ్యూస్
కొత్తగూడెం, జూలై 29: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మలిదశ, తొలిదశ ఉద్యమకారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ ప్రభుత్వాన్ని కోరారు.
డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 ఉద్యమం నుంచి వివిధ దశల్లో పోరాడిన ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఉద్యమకారుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఛైర్మెన్ కె కేశవరావు, రామునాయక్, శోభన్ రెడ్డి, అద్దంకి దయాకర్త రావు, కోదాండ రామ్, మోతే శోభన్ది రెడ్డి తదితరులు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల ఉద్యమకారుల అభిప్రాయాలు, సూచనలు సేకరించారని చెప్పారు. వాటి ఆధారంగా ప్రభుత్వం సమగ్ర నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల గౌరవ పెన్షన్, కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు, అమరుల కుటుంబాలకు తగిన పరిహారం, అలాగే బస్సు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం, మేరగైనా వైద్యం, గుర్తింపు కార్డు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని మాథ్యూస్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఉద్యమకారుల్లో చాలా మంది ఇప్పటికే 70 నుంచి 80 ఏళ్ల వయస్సు దాటారని, అందువల్ల ఆలస్యం చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చాలని కోరారు.
ఈ సందర్భంగా ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న కమిటీ సభ్యులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు, రామునాయక్, శోభన్ రెడ్డి, దయాకర్ తదితరులకు కేజీఎస్ మాథ్యూస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసంతో ఉన్నామని, తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పి. రామచందర్, కామేశ్వరరావు, కొమరయ్య, వీరస్వామి, సీతారాం, మంగపతి, గౌస్, పురుషోత్తం, కృష్ణార్జునరావు, మండే అంజనేయులు, శ్రీహరి, కామేశ్వారారావు, నాగేశ్వరావు, దామేరాకొండ మల్లయ్య, భీమయ్యా, సర్వత్తం రావు, విజయకుమార్, నిజామోద్దీన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment