సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కవిత, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసిన కవిత, ఆయన త్వరితగతిన కోలుకుని మళ్లీ ప్రజల మధ్య చురుకుగా సేవలందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు.

Post a Comment