-->

ఎంబీబీఎస్ ప్రవేశాలకు మరో అవకాశం.. ఆగస్టు 20 వరకు రిజిస్ట్రేషన్

 

ఎంబీబీఎస్ ప్రవేశాలకు మరో అవకాశం.. ఆగస్టు 20 వరకు రిజిస్ట్రేషన్

ఎంబీబీఎస్ ప్రవేశాలకు మరో అవకాశం.. ఆగస్టు 20 వరకు రిజిస్ట్రేషన్

హైదరాబాద్‌, ఆగస్టు 19: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మరో అవకాశం లభించింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) తిరిగి ప్రారంభించింది.

అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న విశ్వవిద్యాలయం.. అర్హత ఉన్న విద్యార్థులకు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. నీట్‌ యూజీ–2026లో నిర్ణీత కటాఫ్‌ స్కోర్‌ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌తో పాటు అవసరమైన ధ్రువపత్రాల అప్‌లోడ్‌ ప్రక్రియ ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటికే గతంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో దరఖాస్తు పూర్తి చేసి, అప్లికేషన్‌ సమర్పించిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ తెలిపింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793