-->

జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


 జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ శ్రమ, నైపుణ్యంతో మనిషి నాగరికతకు రంగులు అద్దిన నేతన్నల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

"నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను చీరలుగా మలిచి మనిషి నాగరికతకు రంగులు అద్దిన ప్రతి చేనేత కార్మికుడికి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు" అని కేటీఆర్ అన్నారు.

మగ్గంపై అద్భుతాలను సృష్టించే తెలంగాణ నేతన్నలు సమైక్య పాలనలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో ఇమిడేంత సన్నని చీరలను నేసే అపూర్వ నైపుణ్యం ఉన్నప్పటికీ, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరల పంపిణీ, రుణమాఫీ, పెన్షన్లు వంటి పథకాల ద్వారా చేనేత కార్మికుల జీవితాల్లో కొత్త ఆశలు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారిదేనని ఆయన తెలిపారు.

చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత పరిశ్రమ సర్వతోముఖ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793