-->

ఆటో డ్రైవర్ల హామీలు వెంటనే అమలు చేయాలి: ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్

 

ఆటో డ్రైవర్ల హామీలు వెంటనే అమలు చేయాలి: ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్

ఆటో డ్రైవర్ల హామీలు వెంటనే అమలు చేయాలి: ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్

పెద్దపల్లి జిల్లా, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను మభ్యపెట్టడం మానుకుని వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా గోదావరిఖని బస్టాండ్ అడ్డాలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం చూపే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించిన మంద రవికుమార్, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలను చూసినా కార్మికుల పొట్టకొట్టే విధానాలు ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించారు.

అలాగే, ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా "ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ వరకు ఆర్టీసీ ఆటోలు" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల ఉపాధికి భంగం కలిగించే ఇలాంటి విధానాలను ఆటో జేఏసీ సహించబోదని హెచ్చరించారు.

రామగుండం కార్పొరేషన్ ఆటో జేఏసీ అధ్యక్షుడు ఎండి బురహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కో-కన్వీనర్ ఎస్.కే. జబ్బర్, జిల్లా నాయకులు కాజీపేట రాజయ్య, పల్లె బాపు, రాజేశం, మడిపెద్ది రమేష్, షరీఫ్ తదితర నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు హాజరై ప్రభుత్వానికి తమ డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793