నిమ్స్ ఆస్పత్రిలో దారుణం.. గాయపడిన యువతిపై అటెండెంట్ అసభ్య ప్రవర్తన
నిమ్స్ ఆస్పత్రిలో దారుణం.. గాయపడిన యువతిపై అటెండెంట్ అసభ్య ప్రవర్తన
హైదరాబాద్, ఆగస్టు 4: నగరంలోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై అటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు విరిగిన యువతిని కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య పక్క బెడ్‌లో ఉన్న మరో రోగి అటెండెంట్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు మరుసటి రోజు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. అనంతరం యువతి తండ్రి, ఆర్‌ఎంపీ వైద్యుడు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వివరాలను సేకరించి, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Post a Comment