-->

చేర్యాల పెద్ద చెరువులో దూకి వ్యక్తి మృతి.. కారణాలపై దర్యాప్తు

 

చేర్యాల పెద్ద చెరువులో దూకి వ్యక్తి మృతి.. కారణాలపై దర్యాప్తు

చేర్యాల పెద్ద చెరువులో దూకి వ్యక్తి మృతి.. కారణాలపై దర్యాప్తు

చేర్యాల, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తదొమ్మట గ్రామానికి చెందిన శెట్టే రామస్వామి (40) మంగళవారం ఉదయం చేర్యాల పెద్ద చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న చేర్యాల పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793